ఈసారి సంక్రాంతి రేస్ రెండు మాస్ సినిమాల మధ్య ప్రధాన పోటీగా మారింది. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రేపు విడుదల కాబోతున్న రామ్ ‘రెడ్’ మూవీ పై భారీ అంచనాలు కొనసాగుతున్నాయి.


మధ్యలో ఎవరు ఊహించని విధంగా బెల్లంకొండ శ్రీను ‘అల్లుడు అదుర్స్’ కూడ సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా ఏకంగా రామ్ ‘రెడ్’ మూవీ విడుదల అవుతున్న రోజునే ఈమూవీ కూడ విడుదల అవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ గా నిర్మాణం జరుపుకున్న ఈమూవీలో టాప్ లైన్ కమెడియన్స్ అంతా నటించినట్లు తెలుస్తోంది. కేవలం ఫన్ మాత్రమే కాకుండా ఈ మూవీలో అనేక కమర్షియల్ అంశాలు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చాలతెలివిగా యాడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇలాంటి కామెడీ టచ్ ఉన్న సినిమాలకు స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ కూడ చాల కీలకం. ఈరెండు విషయాలలోను దర్శకుడు అనీల్ రావిపూడి సంతోష్ శ్రీనివాస్ కు చాల సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో అనీల్ రావిపూడి ముద్ర ఈమూవీలో కనిపిస్తుందని అంటున్నారు. ఆవార్తలే నిజం అయితే రెండు పెద్ద మాస్ సినిమాల విడుదల అవుతున్న ఈమూవీ ప్రేక్షకులకు ఊహించని విధంగా కామెడీ పంచ్ లతో ‘ఎఫ్ 2’ రేంజ్ లో నచ్చుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.


‘క్రాక్’ ‘రెడ్’ సినిమాల బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ మూవీని చాల తక్కువ బడ్జెట్ తో తీసారు. దీనితో ఒకమాదిరిగా ఈ మూవీ హిట్ అయినా ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతి రేస్ విజేత అని ప్రచారం జరిగే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనుకు సరైన ఒక్క హిట్ కూడ రాలేదు. ఇప్పుడు ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను ఈ మూవీ ఎంతవరకు బ్రేక్ ఇవ్వగలుగుతుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: