యంగ్‌స్టర్స్ అంతా ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో వచ్చిన బ్రేక్‌ని కవర్‌ చేయడానికి బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్‌కి సైన్ చేస్తున్నారు. కానీ రామ్‌ మాత్రం ఇంకా తర్వాతి మూవీని కన్ఫార్మ్ చేసుకోలేకపోతున్నాడు. మరి డబుల్‌ ధిమాక్ రామ్‌కి వచ్చిన ప్రాబ్లమ్‌ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  రామ్ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్‌లో సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్, ఈ సంక్రాంతికి 'రెడ్'తో థ్రిల్లింగ్ హిట్ కొట్టాడు. అయితే వరుస హిట్స్‌తో అదరగొడుతోన్న రామ్ మాత్రం నెక్ట్స్‌ సినిమాపై తొందరపడటం లేదు. ఇమేజ్‌కి తగ్గ స్టోరీ కోసం వెతుకుతూనే ఉన్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో రామ్ సినిమా చేస్తాడని కొన్నాళ్లు ప్రచారం జరిగింది గానీ, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ ఒకవైపు జూ.ఎన్టీఆర్‌ సినిమాకి ప్రిపరేషన్స్‌ స్టార్ట్ చేశాడు. మరో వైపు పవన్ కళ్యాణ్, రానా సినిమాకు మాటలు అందించే బాధ్యతలు తీసుకున్నాడు.

రామ్ పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌లో సాలిడ్‌ పొజిషన్‌ సంపాదించుకోవాలనుకుంటున్నాడట. అందుకే 'రెడ్‌' సినిమాని ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. మళయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు బెంగాలీకి వెళ్తోంది 'రెడ్'. అందుకే నెక్ట్స్‌ మూవీని పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నాడట రామ్. మరి ఎనర్జిటిక్‌ స్టార్‌ని బాలీవుడ్‌కి తీసుకెళ్లే డైరెక్టర్‌ ఎవరో చూడాలి.

పాన్ ఇండియన్ మార్కెట్ పై రామ్ ధృష్టి సారించారు. రెడ్ ని మల్టీలింగ్వల్ గా రామ్ విడుదల చేస్తున్నాడు. మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో రెడ్ విడుదల చేస్తున్నాడు. సంక్రాంతికి రెడ్ మూవీ సూపర్‌ రెస్పాన్స్ తెచ్చుకుంది.  'రెడ్' తర్వాత మరో సినిమాకి సైన్ చేయకపోవడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన కలుగుతోంది. ఇక పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎనర్జిటిక్ హీరో రామ్ ఎదురు చూస్తున్నాడు.











మరింత సమాచారం తెలుసుకోండి: