చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమా రంగంలో తన తండ్రి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాడు. అందుకోసం తన తండ్రి మార్గంలోనే ప్రయాణించడానికి నిర్ణయించుకున్నాడు. చిరంజీవికి మాస్ సినిమాలు విపరీతమైన పాపులారిటీని తీసుకువచ్చాయి. దీంతో రామ్ చరణ్ కూడా ప్రస్తుతం మాస్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ రచ్చ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. మరోసారి సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడు. ఈ సినిమాకు చోటా మేస్ర్తీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. చిరంజీవి హీరోగా గతంలో ముఠా మేస్ర్తీ అనే సినిమా వచ్చింది. కాగా, రామ్ చరణ్ నటిస్తున్న నాయక్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: