ఈ సినిమా పై ప్రక్షకుల తీర్పు ఎలా వచ్చినా ఏకంగా హీరోలు నిర్మాతలు మటుకు రాబోతున్న 9 నెలలలో విడుదల కాబోతున్న తమ సినిమాల దాడికి సంబంధించిన లీకులు ఇస్తూ హడావిడి చేస్తున్నారు. వరస పెట్టి విడుదల కాబోతున్న ఈ సినిమాల లిస్టు చూస్తుంటే వరసపెట్టి దాడి చేయబోతున్న ఈ సినిమాల లిస్టులో ఎన్ని విజయవంతం అవుతాయి అన్న సందేహం కలగడం సహజం.
ఫిబ్రవరి నుండి నెలకు ఒక టాప్ హీరో సినిమా సందడి మధ్య ఫిబ్రవరిలో ‘ఉప్పెన’ ‘చెక్’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘జాంబీరెడ్డి’ ‘కపటధారి’ విడుదల కాబోతున్నాయి. ‘చెక్’ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీ పాత్రలో కనిపిస్తాడు అని తెలుస్తోంది. మార్చి నెలలో ‘శ్రీకారం’ ‘గాలిసంపత్’ ‘రంగ్ దే’ ‘అరణ్య’ ‘జాతిరత్నాలు’ ‘మోసగాళ్లు’ లాంటి సినిమాలు రాబోతున్నాయి. మార్చి నెలలో నితిన్ రానా ల మధ్య పోటీ ఉంటుంది. మండే ఎండలు ప్రారంభం అయ్యే ఏప్రియల్ నెలలో ‘సీటీమార్’ ‘వకీల్ సాబ్’ ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ విరాటపర్వం’ సినిమాలు క్యూలో ఉన్నాయి. మే నెలకు సంబంధించి ‘ఆచార్య’ ‘రాధేశ్యామ్’ ‘సాయితేజ్’ ‘రిపబ్లిక్’ మూవీలు లిస్టులో ఉంటే జూన్ లో ‘నారప్ప’ ‘చావుకబురు చల్లగా’ ‘18-పేజెస్’ ‘ఖిలాడీ’ లాంటి సినిమాలు ఎదురు చూస్తున్నాయి.
జులైలో వరుణ్ తేజ్ ‘గని’ తో పాటు భారీ అంచనాలు ఉన్న ‘కేజీఎఫ్ చాప్టర్-2’ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు నాగశౌర్య నటిస్తున్న ‘వరుడు కావలెను’ సినిమా కూడ ఈ రేస్ లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక షూటింగ్ కూడ అల్లు అర్జున్ ‘పుష్ప’ వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ 3’ మూవీలతో పాటు ‘సర్కారు వారి పాట’ కూడ రేసులో ఉంటుందని అంటున్నారు. ఇక రాబోయే అక్టోబర్ నెల అత్యంత కీలకం. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై 1000 కోట్ల బిజినెస్ చేయాలని రాజమౌళి కలలు కంటున్నాడు. ఇప్పుడు ఇన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఇంచుమించు ఖరార్ కావడంతో ఈ మూవీలలో ఎన్ని సినిమాలను జనం చూస్తారు ఎన్ని సినిమాలకు మంచి బిజినెస్ అవుతుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి