హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు కూడా ఇందులో రాసుకుంది. తన ఫిజికల్ అప్పియరెన్స్ మీదనే కెరీర్ ఆధారపడి ఉందని.. కానీ మొదలుకాకుండానే ముగిసిపోయిందనిపించిందని.. స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెరుచుకొని తన మొహం మీదే మూసేసిన ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అలాంటి చేదు అనుభవాలు మొదట్లో ఎదురయ్యాయని.. ఎంతో బాధపడ్డానని తన అనుభవాల గురించి రాసుకొచ్చింది.
అలానే కెరీర్ ఆరంభంలో ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లగాతన బాడీని చూసి వక్షోజాలు చిన్నగా కనిపిస్తున్నాయని.. అలానే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయని.. సర్జరీ చేయించుకోమని చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. అందగత్తెగా గెలిచి వచ్చిన తనను సర్జరీ చేయించుకోమని చెప్పడంతో కుంగిపోయానని తను ఎదుర్కొన్న అనుభవాలని ఆత్మకథలో చెప్పటం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి