
సిద్ పాడిన ప్రతి పాట చాట్ బస్టర్ అవ్వాల్సిందే. పాడిన అన్ని పాటలు హిట్ అవడంతో అతని డిమాండ్ కూడా పెరిగింది. అందుకే సిద్ శ్రీరాం తో పాట అంటే అతను అడిగినంత ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో సిద్ శ్రీరాం తో పాట అంటే అతనికి 6 లక్షలు ఇవ్వాల్సిందే అంట. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఒక్క పాటకి 2 నుండి 3 లక్షలు హయ్యెస్ట్ ఎమౌంట్ తీసుకునే వారట. అలాంటిది అనతి కాలంలోనే సిద్ శ్రీరాం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
రీసెంట్ గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆది సాయి కుమార్ చేస్తున్న శశి సినిమాలో కూడా ఒకే ఒక లోకం నువ్వే అనే పాట కూడా సిద్ శ్రీరాం పాడాడు. ఆ సాంగ్ కూడా సంగీత ప్రియులను అలరిస్తుంది. సిద్ శ్రీరాం పాడే పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు అతను పాడే పాటలు యూత్ ఆడియెన్స్ కు విపరీతంగా నచ్చేస్తున్నాయి.