ఆగష్ట్ 13వ తేదిన సినిమాని రిలీజ్ చేస్తున్నామని ఎనౌన్స్ చేయడం అనేది మార్కెట్ ని పెంచేస్తోంది.ఇప్పుడు అన్ని భాషల్లో కలుపుకుని పుష్ప ఎంత ప్రీరిలీజ్ మార్కెట్ ని కలక్ట్ చేయబోతోందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో దాదాపుగా 500కోట్ల మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఒక్క హిందీలోనే ఈసినిమాని 100కోట్ల మార్కెట్ చేయాలని చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా 150కోట్లకి పైగానే మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులు అలాగే వేరే భాషల్లో బిజినెస్ కలుపుకుని మరో 250కోట్లు బిజినెస్ చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినపిస్తోంది.
ఈ లెక్కన పుష్ప చాలా ఈజీగా రిలీజ్ టైమ్ కి 500కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుందా అని అంచనాలు వేస్తున్నారు.ఒకవేళ అంత బిజినెస్ చేసిన కాని అంత వసూళ్లు రాబట్టే సీన్ ఉందా అని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి