అయితే ఇప్పుడు పరిస్థితులు మారి దక్షిణాది హీరోలు కూడ పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్న పరిస్థితులలో రామ్ చరణ్ కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారబోతున్నాడు. ఇప్పుడు చరణ్ చిరంజీవికి సంబంధించిన మరో తీరని కోరికను కూడ తీరుస్తూ చిరంజీవికి భావోద్వేగాన్ని కలిగించాడు. చిరంజీవి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు.
చిరంజీవి తన కోరికను శంకర్ ఎదుట ఒక ఫంక్షన్ లో అప్పట్లో చెప్పినప్పటికీ ఎందుకనో శంకర్ చిరంజీవిని పెద్దగా పట్టించుకోలేదు అని అంటారు. రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీగా మారిన తరువాత శంకర్ హవా మసక బారడం మొదలైంది. దీనికితోడు శంకర్ తీసిన ‘ఐ’ ‘రోబో’ ‘2.0’ అంచనాలు అందుకోలేక పోవడంతో శంకర్ ఇమేజ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది.
దీనికితోడు శంకర్ భారీ ఆశలు పెట్టుకుని నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ కూడ రకరకాల సమస్యలు మధ్య సతమతమౌతోంది. ఇలాంటి శంకర్ మారుతున్న పరిణామాలు గ్రహించి ఒక మెట్టు దిగి రామ్ చరణ్ తో ఒక మూవీ చేయబోతూ ఉండటం ఆమూవీకి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. జరుగుతున్న ఈపరిణామాలకు భావోద్వేగానికి లోనైన చిరంజీవి తనకు తీరని కోరికను చరణ్ తీరుస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ట్రెండింగ్ గా మారింది.ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారడంతో చిరంజీవికి నిజమైన వారసుడు రామ్ చరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి