తెలుగు ఇండస్ట్రీకి మనోరమ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఈమె ఒక గొప్ప కమెడియన్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఈమే కాదు ఈమె లాంటి ఎంతో మంది హాస్యనటులు జీవించి ఉన్నంతకాలం సినిమాలలో అందర్నీ నవ్వించి, చివరకు వారు చనిపోయే సమయంలో మాత్రం ఎంతో విషాదమైన జీవితాన్ని గడిపారు . అలాంటి వారిలో ముఖ్యంగా కమెడియన్ మనోరమ గురించి చాలా పెద్దగానే చెప్పుకోవాలి.. ఈమె జీవిత చరిత్ర గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు. తమిళంలో అగ్ర నటిగా పేరు తెచ్చుకున్న మనోరమ, తెలుగు సినిమాల్లో కూడా నటించింది..
అంతేకాకుండా ఈమె తమిళనాడులోని నలుగురు సీఎంలతో కలిసి పనిచేసినప్పటికీ ,ఆమె చివరి రోజుల్లో మాత్రం చాలా దుర్భర జీవితాన్ని గడిపింది. ఆమె పడిన కష్టం చూసిన వాళ్ళు, ఇప్పటికీ ఆమెను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. కమెడియన్ లలో ప్రతి ఒక్కరికి ఒక జోడి తప్పకుండా ఉంటుంది. మన తెలుగు లో బ్రహ్మానందం, కోవై సరళ జోడి ల గురించి పెద్దగా చెప్పుకోనవసరంలేదు. ఇక మనోరమకు కూడా నగేష్ జోడి గా వ్యవహరించి, ఎంతో చక్కగా వీరిద్దరూ కలిసి హాస్యాన్ని పండించేవారు. వీరిద్దరు తమిళంలో వందల సినిమాలు చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో కూడా కనిపించారు.
ఇక చివరగా అనుష్క నటించిన అరుంధతి సినిమాలో కీలక పాత్ర పోషించి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అయితే సినిమాల్లో ఉన్నంత కాలం ఎలాంటి వివాదాలకు పోని మనోరమ, రియల్ లైఫ్ లో మాత్రం తన మనవరాలు ఆస్తి విషయంలో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై, తీవ్రంగా కుంగిపోయి ఒక సంవత్సరం పాటు ఆస్పత్రిలోని ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించినప్పటికీ తీవ్రంగా అనారోగ్యం భాదించడంతో తిరిగి సినిమాలకు స్వస్తి పలికింది . ఇక చివరగా 2015లో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి