మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  సమంత, నితిన్ జంటగా తెరకెక్కిన "అ,ఆ"సినిమాలో మల్లిక పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ తర్వాత వరుస సినిమాల్లో నటించారు.ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రాక్షసుడు సినిమాలో చివరిగా వెండితెరపై కనువిందు చేసింది. కేవలం తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అనుపమ కెరియర్లో కేవలం కొన్ని చిత్రాలు మాత్రమే తీయడానికి కారణం కూడా ఉంది.

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన రామ్, రామ్ చరణ్ ఎన్టీఆర్ తో చేసే అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె వదులుకుందనే సమాచారం వినబడుతుంది.ఈ హీరోల సరసన సినిమాలు గనక చేసి ఉంటే అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడో స్టార్ హీరోయిన్ అయిపోయిదని అని ఇండస్ట్రీ సమాచారం. అయితే అనుపమ పరమేశ్వరన్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1) నేను లోకల్:
నాని హీరోగా నేను లోకల్ చిత్రంలో హీరోయిన్ అవకాశాన్ని మొదట అనుపమ పరమేశ్వరన్ కి కల్పించారు. కానీ ఆమె ఈ సినిమాను రిసిప్ట్చేయడంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది.

2) రంగస్థలం:
రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సమంత కన్నా ముందుగా అనుపమాను ఎంచుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో ఆమె స్థానంలో సమంత నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.

3) అరవింద సమేత:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత అనే యాక్షన్ తరహా చిత్రం తెరకెక్కింది. ఈచిత్రంలో హీరోయిన్లుగా పూజాహెగ్డే, ఈషా రెబ్బ నటించారు. ఈ సినిమాలో ఈషా రెబ్బా పాత్రలో ముందుగా అనుపమకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

4) ఇస్మార్ట్ శంకర్:

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కి జోడిగా నభానటేష్ పాత్రలో చేయడానికి అనుపమను సంప్రదిస్తే ఈమె రిజెక్ట్ చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: