మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు 'హాయ్.. రామ్ చరణ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. విడుదలకు రెడీ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చెర్రీ సినిమా విడుదలకు రెడీ అవుతుందా? ఇదెక్కడి సినిమా అనుకుంటున్నారా! ఇదీ రామ్ చరణ్ కొత్త సినిమా కాదు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్-జెనీలియా జంటగా నాగబాబు నిర్మించిన 'ఆరెంజ్' చిత్రాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు.
ఆ సినిమాకు 'హాయ్.. రామ్ చరణ్' అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగు వర్క్ జరుగుతోంది. అప్పట్లో 'మగధీర' చిత్రం తమిళంలో మావీరన్ టైటిల్ తో విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదించింది. ఆ తర్వాత రామ్ చరణ్ మరో మూవీ ‘చిరుత' చిత్రం తమిళంలో ‘చిరుత్తై పులి' టైటిల్ తో విడుదలై బోల్తాపడింది.
రచ్చ చిత్రం కూడా‘రగలై'గా విడుదలై మంచి మంచి టాకే తెచ్చుకుంది. కానీ పెద్గగా వసూళ్లు సాధించలేకపోయింది. మరి తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన 'ఆరెంజ్' సినిమా తమిళంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: