స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే ఏ హీరో రామ్ అంటే తెలియని వారు ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు అని చెప్పవచ్చు . అంతేకాకుండా వీళ్ళిద్దరు తమ నటనతో,ఆహార్యంతో , స్టైల్ మేనరిజంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోలు. ఇక విషయానికొస్తే వై.వి.యస్.చౌదరి ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న లవ్ స్టోరీ తీయాలని ప్లాన్ చేశాడు. అంతకుముందు వై.వి.యస్.చౌదరి తీసిన సీతయ్య మూవీ భారీ సక్సెస్ కావడంతో స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్లో చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ వైవియస్ మాత్రం కొత్త వాళ్లతోనే తీయాలి అనుకున్నాడట ఆ మూవీ ని.


కథ ప్రకారం పక్కా మాస్ అబ్బాయి, సూపర్ రిచ్ గల అమ్మాయి మధ్య లవ్ స్టోరీ. ఆ సినిమాకు బన్నీ అయితే బాగుంటాడు అనుకున్నాడు. గంగోత్రి హిట్ తో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు బన్నీ. అంతేకాకుండా బన్నీ క్రేజ్ ఈ సినిమాను అల్లు అర్జున్ తో చేయిస్తే అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరుగుతుందని ఆలోచన  వై వి ఎస్  చౌదరి ని బాగా గట్టిగా నమ్మేలా చేసింది.   ఆ మూవీ నే 'దేవదాస్ '. కానీ బన్నీ ఈ ప్రాజెక్టులో ఏదో కొన్ని రీజన్స్ తో చేయలేకపోయాడు.


కానీ బన్నీ అంతకుముందే ఆర్య మూవీ కి డేట్స్ ఇచ్చాడు. కథ నచ్చడంతో ఆర్య తర్వాత ఈ ప్రాజెక్టు చేద్దామనే ప్రపోజల్  అల్లు వారి తరుపునుంచి వచ్చిందట. కానీ ఇంత మంచి సబ్జెక్టు ప్లే చేయడం ఇష్టం లేక కొత్తవాళ్లతో ట్రై చేశాడట వై.వి.ఎస్. అదే టైంలో తమిళ మూవీ రీమేక్ రైట్స్ కొని తెలుగులో చేయడానికి వైవియస్ ను  పిలిపించాడు స్రవంతి రవి కిషోర్.


అంతేకాకుండా అతని ఫోన్ లో రామ్  వీడియో క్లిప్పింగ్  చూసి, అలా రామ్ ను దేవదాస్  చిత్రానికి హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. అంతేకాకుండా రామ్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు . అటు ఆర్య తో బన్నీ కి కూడా బాగా క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: