ఈ ప్రోమోలో భాగంగా ప్రస్తుతం జాతిరత్నాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఇక ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగా నవీన్ పొలిశెట్టి గెస్ట్ గా వచ్చాడు అంటే చాలు మొత్తం సందడి సందడి గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఇక ఇటీవల విడుదలైన ప్రోమో చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. అలీ అడిగిన ప్రశ్నలకు నవీన్ పొలిశెట్టి ఆసక్తికర సమాధానాలు చెబుతూ అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఈ క్రమంలోనే నీ లవ్ ఏమైంది ఒకప్పుడు ఉండేది కదా అంటూ ఆలీ ప్రశ్నించగా ఒక్కసారిగా షాక్ అవుతాడు నవీన్ పొలిశెట్టి.
అలాంటి లవ్వు ఏమీ లేదని ప్రస్తుతం కేవలం ప్రేక్షకులతో మాత్రమే లవ్ ఉంది అంటూ నవీన్ పొలిశెట్టి చెబుతాడు. అంతే కాకుండా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు కూడా నవీన్ పొలిశెట్టి అదిరిపోయే కామెడీ ఆన్సర్లు చెబుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఇక ఈ ప్రోగ్రామ్ లో భాగంగా చివర్లో జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలోనే ఇద్దరిని పలు ఆసక్తికర ప్రశ్నలడుగుతూ ఉంటాడు వ్యాఖ్యాత అలీ. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈ వారం నవీన్ పొలిశెట్టి పూర్తిగా ఆలీతో సరదాగా ఎపిసోడ్ లో తన పంచులతో అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచబోతున్నాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి