జాతిరత్నాలు సినిమా రెండో వారం లో కూడా సెన్సేషనల్ అనిపించే విధంగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది, ఆల్ మోస్ట్ 350 థియేటర్స్ లో ఈ సినిమా రెండో వారాన్ని కొనసాగిస్తూ ఉండగా సినిమా మొదటి వారం మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 27.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ నే దాటేసి సంచలనం సృష్టించింది, అంటే టోటల్ కలెక్షన్స్ ఏరియాలో కలెక్షన్స్ లెక్క కాదు. నైజాం ఏరియాలో మెయిన్ కలెక్షన్స్ సెంటర్ గా భావించే rtc X రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ లో.
ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసింది, బాహుబలి 2 సినిమా 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు మొదటి వారంలో 36 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించగా ఈ సినిమా రికార్డును కేవలం 2 సినిమాలే దాటాయి, అవి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురం లో సినిమాలు.నార్మల్ రికార్డ్ గా అనిపించేది, కానీ ఓ చిన్న సినిమా నార్మల్ టికెట్ రేట్స్ తోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతూ ఉండటం ఇప్పుడు బాహుబలి కలెక్షన్స్ నే దాటడం అనేది బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అండ్ సినిమా క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి