
ఒక్కసారిగా పొలోమని నెటిజన్లు విరుచుకుపడ్డారు బండ్లమీద అమాంతంగా.తప్పు తెలుసుకుని స్పెల్లింగ్ మార్చి మళ్ళీ మరోసారి మరో బండబూతు ఇంగ్లీష్ మాటని పెట్టాడు. అదేంటయ్యా అంటే ware mask అని. మరి నెట్ వీరులు ఊరుకుంటారా. మళ్ళీ చెడుగుడు ఆడేశారు. ''బాబూ. బండ్లబాబూ. నీ దిక్కుమాలిన ఇంగ్లీష్ భాషని భరించలేకపోతున్నాం.. మాకొచ్చిన ఆంగ్లం కూడా మరచిపోయేట్టు చేస్తున్నావు.. ఎందుకు రాని ఇంగ్లీష్‌లో ఆ ఏడుపు.నీ కామెడీని భరించలేకపోతున్నాం.ఇంగ్లీష్ పరువు తీయకురా బాబూ.." అనే కామెంట్స్‌తో కుమ్మేశారు.
తను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా రాజకీయనాయకుల అండ, మెగాఫ్యామిలీ దండ తనకి ఉందనే అపోహలో, భ్రమలో.. ఫంక్షన్స్‌లోనూ, టీవీ ఛానెల్స్‌లోనూ ఇష్టానికి రెచ్చిపోయి మాట్లాడి, పరిస్థితులు ఎదురు తిరగ్గానే నాలిక కరుచుకుని నోరు మూసుకున్న బండ్ల గణేష్‌బాబు సోషల్ మీడియా ఎదురుగా ప్రత్యక్షమవగానే, దాని ద్వారా లైవ్‌లో ఉండాలీ అనే అనవసర ఉత్సాహంతో మరింత నవ్వుల పాలవడం బండ్లకి ఆనవాయితీ అయిపోయింది..ఇప్పుడు కూడా వచ్చిరాని ఇంగ్లీష్ తో బుక్కయ్యాడు మన బండ్ల బాబు.. అన్నట్లు ఇటీవలే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మళ్ళీ కమెడియన్ గా దర్శనం ఇచ్చాడు బండ్ల గణేష్.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!