వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని కోరమంగలలో కేఫ్ పెట్టడానికి నిక్కీ గల్రాని ని 2016 లో ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ హెగ్డే కలిశాడట. అయితే ఈమె కూడా అతనిని నమ్మి ఈ కేఫ్ పెట్టడానికి 50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. కానీ వీరు ఇరువురు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల నిక్కీ గల్రానీ కి లక్ష రూపాయల వరకు చెల్లించాలి. కానీ ఇతను ఇప్పటి వరకు ఒక్క నెల కూడా అనుకున్న విధంగా చెల్లించలేదని తెలిపింది. మరియు విషయం కనుక్కోవడానికి ఫోన్ చేస్తుంటే నా ఫోన్ ను లిఫ్ట్ చేయడం లేదని వాపోయింది.
దీనికి పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి నిఖిల్ హెగ్డే పై చీటింగ్ కేసును నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విషయమై నిఖిల్ హెగ్డే ను విచారణ నిమిత్తం ట్రయల్స్ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో పలు సినిమాలలో నటించింది. కాగా ఈ కేసులో తరువాత ఏ పరిణామాలు జరుగుతాయో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి