దీనితో యూటర్న్ తీసుకుని అనీల్ రావిపూడి బాలకృష్ణ తో తన సహజ సిద్ధమైన కామెడీ చేయించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కథలో కళ్యాణ్ రామ్ లో కూడ ఒక కీలక పాత్రను క్రియేట్ చేసి ఆమూవీ నందమూరి మల్టీ స్టారర్ గా ప్రమోట్ చేయాలని అనీల్ రావిపూడి కోరిక అని అంటున్నారు. వాస్తవానికి కళ్యాణ్ రామ్ కు ఒక మంచి బ్రేక్ ఇస్తానని అనీల్ రావిపూడి గతంలో లోనే మాట ఇచ్చాడు అని అంటారు.
తనకు దర్శకత్వం వహించే సమర్థత ఉందని గుర్తించి తనతో ‘పటాస్’ మూవీ చేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అనీల్ రావిపూడి అనేకసార్లు ఓపెన్ గానే చెప్పాడు. ఇప్పుడు ఆ ఋణం తీర్చుకోవడానికి బాలయ్యతో తీస్తున్న సినిమాలో కళ్యాణ్ రామ్ కు కూడ ఒక కీలక పాత్రను క్రియేట్ చేసి తన ఋణం తీర్చుకోవాలని అనీల్ రావిపూడి ఆలోచన అని టాక్. దీనితో అనీల్ రావిపూడి నందమూరి మల్టీ స్టారర్ ను తీయబోతున్నారు అన్నవార్తల హడావిడి మొదలైంది.
ఈ వార్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారి స్పందన మాత్రం వేరే విధంగా ఉంది. నందమూరి మల్టీ స్టారర్ అంటే బాలయ్య జూనియర్ లు కలిసి నటించిన సినిమా అయితే బాగుంటుందని అలా కాకుండా బాలయ్య కళ్యాణ్ రామ్ లతో నందమూరి మల్టీ స్టారర్ ఎలా అవుతుంది అంటూ కొంత అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నందమూరి అభిమానులు జూనియర్ బాలయ్యలను ఒకే స్క్రీన్ పై చూడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. దీనితో అనీల్ రావిపూడి బాలకృష్ణ జూనియర్ ను కలిపే విషయం ఆలోచిస్తే బాగుంటుంది అన్నది అభిమానుల కోరిక..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి