తెలుగు చిత్ర పరిశ్రమకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసేంది. ఆతర్వాత తెలుగులో సాయిపల్లవిని అవకాశాలు క్యూకట్టాయి. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ రికార్డును బ్రేక్ చేసి సౌత్‌లోనే ఏకైక స్టార్‌గా అరుదైన ఘనత సాధించింది సాయి పల్లవి.
ఇక ప్రస్తుతం సాయిపల్లవి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి