గత కొంతకాలంగా పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్ పేరిట రకరకాల సామాజిక విషయాల పై పూరీ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు. ఈకామెంట్స్ అన్నీ చాల విజ్ఞాన దాయకంగా ఉండటంతో సోషల్ మీడియాలో పూరీకి రోజురోజుకు ఫాలోయర్స్ సంఖ్య పెరిగిపోతోంది.


వరస పరాజయాల తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన కిక్ ను కొనసాగించాలని పూరీ విజయ్ దేవరకొండతో తీస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూటింగ్ కు కరోనా పరిస్థితులు అడ్డుతగలడంతో ఖాళీగా ఉన్న పూరీ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చాల యాక్టివ్ గా ఉంటున్నాడు. ప్రస్తుతం  సెలెబ్రెటీల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరికీ కరోనా భయాలు ఏర్పడటంతో ఆభయాన్ని తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు తమకు తోచిన సలహాలను మిగతా వారికి ఇస్తున్నారు.


దీనికితోడు ఇప్పుడు పెద్దగా చదువు రానివారు కూడ ‘ఇమ్యూనిటీ’ అన్న పదం గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో కరోనా వైరస్ నుండి రక్షించుకోవడానికి పూరీ బయటపెట్టిన ‘రాజముడి రైస్’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రైస్ పేరు వినగానే మనకు బాస్మతి, అన్నపూర్ణ, సోనామసూరి లాంటి రకాలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు రైస్ లో లక్ష రకాల వెరైటీలు ఉండేవట ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయం భారమైన పరిస్థితులలో రైస్ లోని చాల వెరైటీలు అదృశ్యమైపోయాయి.  ఈపరిస్థితులలో మనదేశంలో ఆరు వేల రకాల రైస్ మాత్రమే ఉన్నాయని వ్యవసాయ పరిసోదకులు అంటున్నారు. అందులో ‘రాజముడి’ రైస్ గురించి చాలమందికి తెలియదు.


పూర్వకాలంలో కర్ణాటకలో ప్రజలు పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ రాజముడి రైస్ పన్నుగా కట్టేవారు. ఈ రైస్ కి అంత విలువ ఉండేది అని అంటారు. ఈ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.  డయాబెటిక్ పేషంట్స్ ఆడవాళ్లు ఖచ్చితంగా ఈ రైస్ ను తింటే మనం కరోనా భయాల నుంచి తప్పించుకోవచ్చు అంటూ పూరీ చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని చాలామంది ఈ రైస్ ఎక్కడ దొరుకుతాయి అంటూ గూగుల్ లో తెగ సర్చి చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: