పరిశ్రమ అయినా సక్సెస్ ఉంటేనే, పని ఉంటేనే పూట గడవడం కష్టం అవుతుంది.. అలాంటిది చేతిలో పని లేక ఉండే వారి ఆకలి బాధలు ఎవరికీ తెలియంది కాదు.. అలాంటి ఆకలి బాధలు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ అని చెప్పవచ్చు.. సక్సెస్ ను చూసి మళ్ళీ జీరో కి పడిపోయిన ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు చాలామంది ఉన్నారు.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ లో ఉన్న వారు ఇప్పుడు చేతిలో డబ్బులు లేకుండా జీవిస్తు ఆపసోపాలు పడుతున్నారు.. అలాంటి వారిలో నటి పావలా శ్యామల ఒకరు..

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు పావలా శ్యామల.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. చేసేది తక్కువ నిడివి ఉన్న పాత్రలే అయినా మంచి ఇమేజ్ ఉండే పాత్రలే ఎక్కువగా చేసేవారు.. ఇష్టం వచ్చినట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు పావలా శ్యామల.. నిన్న మొన్నటి వరకు కూడా పావలా శ్యామల బిజీ నటి గా ఉంటూ ప్రేక్షకులను అలరించారు..

చాలా రోజులక్రితమే ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోగా ఆమె కూతురును చూసుకుంటూ ఇన్నాళ్ళు నెట్టుకొచ్చింది.. చాలీచాలని డబ్బులతో కూతుర్ని కాపాడుకుంటూ వచ్చినా ఆమెను దురదృష్టం వెంటాడింది.. కూతురు అనారోగ్యం పాలవడంతో ఆమెకు పుండు మీద కారం చల్లినంత పనయింది.. కూతురు ఆరోగ్యానికి డబ్బులు సరిపోక, సినిమా అవకాశాలు  రాక కూతురితో పాటు ఈమె కూడా అనారోగ్యం పాలయ్యారు.. కరోనా నేపథ్యంలో ఈమె పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయింది.. ఎవరైనా వచ్చి సాయం చేస్తే గాని కోలుకోలేని స్థితి కి ఇంటికి చేరుకుంది.. ఆమె నటించిన సినిమాలకు వచ్చిన అవార్డులు, రివార్డులను అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి వచ్చారు.. ఈవిడ కష్టాలను చూసి టాలీవుడ్ నటి కళ్యాణి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. మా అసోసియేషన్ నుంచి ఆమెకు ప్రతినెలా వచ్చేలా చేస్తానని ఆమె వెల్లడించారు..



మరింత సమాచారం తెలుసుకోండి: