సినీమా పరిశ్రమ చరిత్రలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇక్కడ రాణించాలంటే రాసిపెట్టుండాలి. ప్రతిభతో పాటు ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి ఇక్కడ సూపర్ స్టార్ లు గా ఎదిగిన వారున్నారు. అలాగే ఎంత సినీ నేపథ్యం ఉన్నా అదృష్టం కలిసి రాక వెనుదిరిగిన తారలు ఉన్నారు. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కి డిజాస్టర్ లుగా మిగిలిన సినిమాలు ఉన్నాయి. ఇదే తరహాలో భారీ బడ్జెట్ తో రూపొంది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రాలలో ఒకటి స్పైడర్. అందులోనూ ఇది మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కూడా అవ్వడం విశేషం. సక్సెస్ ఫుల్ దర్శకుడు మురుగదాస్, అగ్ర కధానాయకుడు ప్రిన్స్ మహేష్, అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, విలక్షణ నటుడు ఎస్ జె సూర్య ఇలా రేర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది.

శ్రీమంతుడు చిత్రంతో సూపర్ హిట్, బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత మహేష్ చేసిన సినిమా ఇది. 27 సెప్టెంబర్  2017 లో భారీ అంచనాల నడుమ విడుదలైన  ఈ చిత్రం ఊహించని రీతిలో నిరాశను మిగిల్చింది. కేవలం రెండు పాత్రల నడుమ చేసిన వృధా ప్రయాణమని ఎన్నో  విమర్శలు  ఎదుర్కొంది. ఈ  చిత్రంలో మహేష్ ఒక స్పై గా కనిపించగా, ప్రముఖ తమిళ నటుడు మరియు దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించారు. నటన పరంగా వీరిద్దరూ పోటీ పడి నటించి మంచి మార్కులే సంపాదించారు. అయితే 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా  ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ చాలా నాసిరకంగా అనిపించాయి.  విజువల్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు. ప్రధానంగా మహేష్ బాబు కు ఈ కథ సూట్ అవ్వలేదు. ఆయన క్రేజ్ కు  తగ్గ కథ కాదనే కామెంట్స్ ఎక్కువగానే వినిపించాయి. ఈ సినిమాను ఎంతో నమ్మకంగా అంత పెద్ద బడ్జెట్ తో తీసినప్పుడు ఎందుకు మంచి ఫలితాలను ఇవ్వలేకపోయింది అన్న విషయానికొస్తే, గ్లామర్ ఇమేజ్ భారీగా ఉన్న మహేష్ ఇలా పూర్తి భిన్నమైన కథను ఎంచుకుని సాహసం చేసాడని చెప్పవచ్చు.


సినిమా ప్రమోషన్స్ సమయంలో, సినిమా క్లైమాక్స్ విషయంలో ఎక్కువ అంచనాలను క్రియేట్ చేయడం  వలన థియేటర్లో  అంతకు మించి ఊహించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. క్లైమాక్స్ చాలా సాదాసీదాగా అనిపించి, ప్రేక్షుకులకు ఆసక్తిని కలిగించడంలో విఫలం అయింది. కథలో తెలుగు నేటివిటీ కంటే  తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించడం మరో ప్రతికూలత అని చెప్పొచ్చు.  మహేష్ ,సూర్య లకు తప్పించి  ఇతర పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన మురుగదాస్ నుండి వస్తున్న భారీ చిత్రం కావడం, లవర్ బాయ్ మహేష్ బాబు కెరియర్ లోనే భారీ మెగా చిత్రం కావడంతో ఈ సినిమా పై ముందుగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ రిలీజ్ అనంతరం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. స్పైడర్ మూవీ పేపర్ మీద ఉన్నంత ఎక్సయిటింగ్ గా తెర మీద వచ్చేసరికి రెండున్నర గంట సేపు నిలబెట్టే స్టామినా ఇక్కడ మిస్ అయ్యింది. దీనితో మహేష్ కెరీర్ లో ఒక ఈ సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: