తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కారణాలతో చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత, పీఆర్‌ఓ, సూపర్ హిట్ మ్యాగజైన్ నిర్వాహకుడు బీఏ రాజు కన్నుమూశారు.  సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా బీఏ రాజు విజయవాడలో కెరీర్‌ ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్ మోహన్ కుమార్ వద్ద శిష్యరికం చేశారు. మోహన్ కుమార్ ప్రోత్సాహంతో ఆయన సినీ జర్నలిస్ట్ గా మారారు. దాదాపు 40 ఏళ్లుగా జర్నలిస్టుగా ఆయన కొనసాగారు. సూపర్ హిట్ పత్రిక ప్రారంభించిన ఆయన ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. 


కృష్ణతో పాటు మహేష్ బాబుకి అభిమానిగా మారిన ఆయనకి సీనియర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో మంచి అనుబంధం ఉంది. కృష్ణ కుటుంబంలో అందరు హీరోల సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు.  వారితో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జునతో పాటు ఎంతో మంది సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి పని చేశారాయన. బీఏ రాజు చాలా కాలం నుంచి మహేశ్ బాబుకు పీఆర్ఓగా పని చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన మరణవార్త తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు స్టార్ హీరో మహేష్ బాబు. 


ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ కూడా చేశారు. ‘బీఏ రాజు గారి మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నప్పటి నుండి తెలుసు. మేమిద్దరం చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు. . సినిమాల విషయంలో రాజు అంచనాలు, విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటుందనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించారు.. ఆ బ్యానర్ ఏమిటి… రిలీజ్ డేట్ ఏమిటి… అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది లాంటి వివరాలను, విశేషాలను ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన ఏకైక వ్యక్తి బీఏ రాజు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: