ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.గత ఏడాది కరోనాతో విధించిన లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల కోసం సొంతంగా రవాణా సదుపాయాలు కల్పించి..కొన్ని వేల మందిని సురక్షితంగా ఇంటికి చేర్చి రియల్ హీరో అనిపించుకున్నాడు.ఇక అక్కడి నుండి మొదలైన ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా కరోనా రోగులకు వైద్యాన్ని అందించడం,అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సి వస్తే వెంటనే దాన్ని ఏర్పాటు చేయడం..వంటి మంచి కార్యక్రమాలతోప్రజల పట్ల ఆరాధ్యదైవంగా మారాడు సోనూసూద్. 

అయితే కేవలం ఇవి మాత్రమే కాదు ఇప్పుడు కొత్తగా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రియల్ హీరో.సివిల్ సర్వీసెస్ లో చేరాలనుకునే వారికి అండగా నిలుస్తూ.. వారికి చేయుతనందించాడానికి సిద్ధం అయ్యాడు సోనూసూద్.'సంభవం'అనే పేరుతో వారికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారు.ఈ విషయాన్ని నిన్న రాత్రి సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ మేరకు సోనూసూద్ ట్వీట్ చేస్తూ.. "ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేము తీసుకుంటాం.'సంభవం'ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్ గా ఉందటూ" పేర్కొన్నారు..

ఇందులో భాగంగానే సివిల్ సర్వీసెస్ కోసంసిద్ధం అవుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు సోనూసూద్.అంతేకాదు దరఖాస్తుల సమర్పణకు జూన్ 30 చివరి తేదిగా ప్రకటించారు.ఇక దానికి సంబంధించిన వెబ్సైట్ వివరాలను కూడా ఆ ట్వీట్ లో పొందుపరిచారు.సోనూసూద్ అనే ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ..తన సేవా కార్యక్రమాలను ఇంకా విస్తరిస్తూ వెళ్తున్నారు ఈ రియల్ హీరో..ఇక ప్రస్తుతం సోనూసూద్ సినిమా విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా హిందీలో కూడా హీరోగా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సోనూసూద్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: