టాలీవుడ్ లో ప్రస్తుతం యువ దర్శకుల హవా కొనసాగుతుంది. కొత్త కొత్త ఐడియాలతో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వెండితెర మీద అవకాశం రావాలంటే ముందు స్మాల్ స్క్రీన్ పై వారి సత్తా చాటాల్సిందే. స్మాల్ స్క్రీన్ అంటే బుల్లితెర అని కాదు యూట్యూబ్ స్క్రీన్ మీద తమ సత్తా చాటితే చాలు వెండితెర అవకాశం దక్కించుకున్నట్టే. ఈమధ్య కాలంలో చాలా మంది నూతన దర్శకులు ఇలానే షార్ట్ ఫిల్మ్ తో సక్సెస్ అందుకుని ఫీచర్ ఫిల్మ్ ఛాన్స్ అందుకున్నారు. ప్రస్తుతం యువ దర్శకులుగా క్రేజ్ తెచ్చుకున్న వారంతా ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి తమని తాము ప్రూవ్ చేసుకున్న వారే అని తెలుస్తుంది.

ఒకప్పుడు డైరక్టర్ అవ్వాలనుకునే వారు సీనియర్ డైరక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసే వారు కాని ఇప్పుడు అలా లేదు ఓ షార్ట్ ఫిల్మ్ చేయడం డైరెక్ట్ గా మెగా ఫోన్ పట్టేయడం జరుగుతుంది. నిర్మాతలు కూడా వారు ఎంచుకున్న కథను సరిగా తీయగలరా లేదా అన్నది వారు తీసిన షార్ట్ ఫిల్మ్ ఆధారంగ వారి టాలెంట్ ని అంచనా వేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ లో మెప్పించగలిగితే చాలు వారికి సినిమా ఛాన్సులు ఇస్తున్నారు. ఈ తరహా దర్శకులు కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తోనే వస్తున్నారు.

తమని నమ్మి నిర్మాత డబ్బులు పెడుతున్నాడు కదా అని కోట్ల బడ్జెట్ తో సినిమా తీయకుండా స్మాల్ బడ్జెట్ లోనే సినిమా కానిచ్చేస్తున్నారు. ఎలాగు కాన్సెప్ట్ బాగుంటుంది కాబట్టి సినిమా లాభాలు తెచ్చేస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మేర్లపాక గాంధి నుండి జాతి రత్నాలు డైరక్టర్ కెవి అనుదీప్ వరకు ముందు షార్ట్ ఫిల్మ్ తో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత వారికి వచ్చిన ఫీచర్ మూవీ అవకాశాన్ని సక్సెస్ చేసుకోగలిగారు. ఓ రకంగా షార్ట్ కట్ లో డైరక్టర్ అవ్వాలంటే షార్ట్ ఫిల్మ్ తో సత్తా చాటితే సరి అన్న విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: