మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ టాప్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన పోకిరి సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని రికార్డులను ఏ సినిమా కూడా దాట లేకపోయింది. రాజకుమారుడు చిత్రంతో పరిచయమై యువరాజ్, మురారి, ఒక్కడు చిత్రాలతో విజయాన్ని అందుకొని దూసుకుపోతున్న మహేష్ బాబు కు ఈ సినిమా చేయడానికి ముందు ఎన్నో సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో పూరి జగన్నాథ్ పోకిరి సినిమా మంచి విజయాన్ని సాధించడం సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా మహేష్ బాబు ను కొత్తగా చూపించి మాస్ హీరోగా మలిచింది.

ప్రత్యేకమైన అభిమానం వర్గం సూపర్ స్టార్ కు ఈ సినిమాతోనే మొదలైంది. పూరి జగన్నాథ్ కి కూడా ఆంధ్రావాలా,  సూపర్ వంటి ఫ్లాప్ సినిమాలను ఫ్లాప్ చేయడంతో ఆయనతో సినిమా ఏంటి అని మహేష్ బాబు ను చాలా మంది హెచ్చరించారట. కానీ వీటిని పట్టించుకోకుండా పూరి మీద నమ్మకంతో పోకిరి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.  అప్పటిదాకా మహేష్  మహేష్ ని కృష్ణ తనయుడు అని పిలిచేవారు కానీ ఈ చిత్రంతో మహేష్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనిపించుకున్నాడు.

మహేష్ కెరీర్లోనే ఒక సెన్సేషనల్ సినిమాగా మిగిలిపోయిన పోకిరి మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా రీమేక్ అని చెబుతున్నారు. టి సుబ్బిరామి రెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు కాగా ఈ రెండు చిత్రాల కథలు ఒకే పోలికతో ఉన్న కథలు కావడంతో ఆ సినిమాకి పోకిరి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు పోషించిన పాత్ర భవిష్యత్తులో గతంలో ఎప్పుడూ పోషించనీ విధంగా ఉంటుంది. ప్రకాష్ రాజ్ తన విలనిజం తో ఎంతో చక్కగా అలరించిన సినిమా ఇది. మణిశర్మ సంగీతంలోని పాటలు ఇప్పటికీ మారు మోగిపోతూనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: