తెలుగు సినిమాలకు సంగీతం అందించడమే.. కాకుండా మ్యూజిక్ షోలు చేస్తూ... దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవీశ్రీప్రసాద్. దేవీశ్రీ స్వరాలు సమకూర్చిన సినిమాల్లోని పాటలు కుర్రకారును ఎంతలా మెస్మరైజ్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డు విన్నింగ్ ప్రదర్శనలు చేశాడీ... సంగీత సంచలనం. తాను సైన్ చేసిన సినిమాలకు అద్భుతమైన బాణీలందించడమే కాకుండా... సోషల్ మీడియాలోనూ హైపర్ యాక్టివ్ గా ఉంటాడీ రాక్ స్టార్.


తెలంగాణ రాష్ర్టానికి చెందిన చిన్నారి గాయని ఒకరు తాను పాట పాడుతూ... ట్విటర్ లో చేసిన పోస్ట్ ని చూసి ఫిదా అయిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజు ఆ వీడియోను దేవీశ్రీప్రసాద్, తమన్ కు ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన రాక్ స్టార్ డీఎస్పీ ఆ చిన్నారి గాయని ప్రతిభను ప్రశంసించాడు. పొగడ్తలతో ముంచెత్తాడు. ఇతంటి గొప్ప టాలెంట్ ను పరిచయం చేసినందుకు మంత్రి.. తారక రామారావు కు కృతజ్ఞతలు తెలిపాడు.

తాను చేయబోయే కొత్త షోలో పాడించడానికి ఇటువంటి ట్యాలెంట్ ఉన్న వాళ్ల కోసం వెతుకుతున్నట్లు తప్పకుండా ఆ చిన్నారికి అవకాశం కల్పిస్తానని తెలిపాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్, టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన కన్నడ బామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో ఈ చిత్రం పక్కా.. చిత్తూరు యాస లో ఉండనుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  చిత్రానికి కూడా స్వరాలు సమకూరుస్తున్నాడు. వీటితో పాటు మరిన్ని భారీ ప్రాజెక్టులకు కూడా రాక్ స్టార్ డీఎస్పీ పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: