#10.ఖైదీ నంబర్786
1988లో విడుదలైన ఈ సినిమాకి బాపినీడు దర్శకత్వం వహించారు.ముఖ్యంగా సినిమాలో పాటలు, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలవడంతో అప్పట్లో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది ఈ సినిమా.
#9.చంటబ్బాయి
చిరంజీవి కామెడీ పాత్రలలో కూడా రాణించగలడని నిరూపించిన సినిమా చంటబ్బాయి. సినిమాలో చిరు డిటెక్టివ్ పాత్రలో మంచి నటనకు కనబర్చాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
#8.ఛాలెంజ్
ఓ నిరుద్యోగ యువకుడు ధనవంతుడ్ని సవాల్ చేసే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాబ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు ప్రశంసలు పొందింది.
#7.స్వయం కృషి
చిరంజీవికి అనేక అవార్డులను తెచ్చిపెట్టిన సినిమా ఇది.ఈ సినిమాలో చిరూ నటనకి ఆడియన్సే కాదు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది.
#6.రుద్రవీణ
కె.బాలచందర్, చిరంజీవి కలయికలో వచ్చిన ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా రూపొంది.. సమాజంలో సాంప్రదాయ పద్ధతులకు స్ఫూర్తినిచ్చింది.
#5.ఖైదీ
చిరంజీవిని ఓవర్ నైట్ స్టార్ ని చేసిన సినిమా ఖైదీ.కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పుట్లో సంచలన విజయం సాధించి..చిరంజీవి క్రేజ్ ని డబుల్ చేసింది.
#4.ఠాగూర్
చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఠాగూర్ మొదటి స్థానంలో ఉంటుంది.వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించి..191 కేంద్రాల్లో ఏకంగా 100 రోజులు ఆడింది.
#3.ఇంద్ర
చిరూ కెరీర్లో అతి పెద్ద విజయాలలో ఇంద్ర కూడా ఒకటి.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో చిరంజీవి 6వ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.
#2.గ్యాంగ్ లీడర్
ఈ సినిమాతోయూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు చిరూ.విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించి.. హిందీలో కూడా రీమేక్ అయ్యింది.
#1.జగదేక వీరుడు అతిలోక సుందరి
దర్శకుడు రాఘవేంద్రరావు తెరక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది.సినిమాలో చిరంజీవి విన్యాసాలు, శ్రీదేవి అందాలు, అమ్రిష్ పూరి విలనిజం..ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అప్పట్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన్న ఈ సినిమా ఒకే థియేటర్ లో ఏకంగా 200 రోజులు ప్రదర్శింపబడింది...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి