ఛార్మీ , దేవి శ్రీ ప్రసాద్ ల ప్రేమ కహానీ అందరికీ తెలిసిందే.  వారిద్దరి ప్రేమ పెళ్లి పీటల వరకు రాకముందే పెటాకులైంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొన్ని రోజులు ఈ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేసింది. ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్నారు. సంగీత ప్రపంచంలో ప్రేక్షకులను ఇప్పటికీ తన పాటలతో, మ్యూజిక్ తో అలరిస్తున్నాడు దేవిశ్రీప్రసాద్. టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే ఉన్నారు ఆయన.  ఛార్మి కూడా నటనకు స్వస్తి చెప్పి నిర్మాణ బాధ్యతలను చేపట్టింది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనీ లైగర్ సినిమాకి ఆమె ఓ నిర్మాతగా వ్యవహరిస్తుంది. అంతకుముందు పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలను నిర్మించి ఛార్మీ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. నటిగా తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చార్మి ప్రొడ్యూసర్ గా మారడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి హీరోయిన్లు నిర్మాతలుగా మారడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. టాప్ హీరోయిన్ నిర్మాతగా మారింది అంటే అర్థం చేసుకోవచ్చు కానీ యావరేజ్ హీరోయిన్ అయిన ఛార్మి నిర్మాతగా మారింది అంటే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలనీ తెరకెక్కించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరి ఛార్మీ ప్రొడ్యూసర్ గా ఇంకా ఎలాంటి సంచలన ప్రాజెక్టులు చేస్తుందో చూద్దాం. ఇకపోతే దేవిశ్రీప్రసాద్ చార్మి ల ప్రేమ కథ అప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. ప్రతి ఒక్కరు వారి గురించే మాట్లాడుకునేవారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అనేంతగా పబ్లిసిటీ అయ్యింది వీరిద్దరి గురించి. కానీ అది జరగలేదు. నిజానికి అది నిజం కాదని అది ఒట్టి పుకార్లే అనీ  వారిద్దరూ తెలియజేశారు. మరి తన మాజీ ప్రియుడు దేవి శ్రీ తో చార్మి  భవిష్యత్తు లో హీరో గా  ఓ సినిమా చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: