అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న ‘పుష్ప’ మూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా పెరిగిపోవడంతో పాటు ఈ మూవీ కథ కూడ పెరిగిపోవడంతో ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఈమూవీని రెండు భాగాలుగా తీసే విషయంలో బన్నీ సుకునార్ ల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోయినప్పటికి ఈ రెండు భాగాలు ఎప్పుడు విడుదల చేయాలి అన్న విషయమై వీరిద్దరి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇంకా 45 రోజులు పెండింగ్ లో ఉంది అని అంటున్నారు. జూలై మొదటి వారంలో ఈమూవీ షూటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టి ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను ఈ సంవత్సరాంతంలోగా విడుదల చేసి వచ్చే సంవత్సరం జనవరి నుండి ‘పుష్ప’ సెకండ్ పార్ట్ షూట్ మొదలు పెట్టాలని సుకుమార్ ఆలోచన అని టాక్.

అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ అభిప్రాయాలు వేరే విధంగా ఉన్నాయి అని అంటున్నారు. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే సెకండ్ పార్ట్ షూట్ కు వెళ్ళకుండా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇప్పటికే రెడీ అయిన ‘ఐకాన్’ మూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఆ మూవీ పూర్తి అయిన అతరువాత ‘పుష్ప’ సెకండ్ పార్ట్ వైపు రావాలని బన్నీ అభిప్రాయం.

సుకుమార్ మాత్రం బన్నీ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోతున్నాడు అని టాక్. దీనికి కారణం బన్నీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ తరువాత మరొక సినిమా వైపు వెళ్ళిపోతే ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ లో తాను ఎటువంటి సస్పెన్స్ పెట్టినా ఆ ట్విస్ట్ ఎక్కువకాలం జనం మధ్యన ఉండదని ముఖ్యంగా బన్నీ మరొక సినిమాను గ్యాప్ లో చేస్తే ‘పుష్ప’ పార్ట్ 2 పై ప్రేక్షకులలో క్రేజ్ బాగా తగ్గిపోతుంది అంటూ సుకుమార్ తన అభిప్రాయాన్ని వివరిస్తూ బన్నీని ఒప్పించడానికి శతవిధాల ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: