సినిమా రంగంలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం. ఆ విధంగా
హీరో మరియు కమేడియన్ అయిన
సునీల్ తొలుత కమెడీయన్ గా
సినిమా ఆ తర్వాత హీరోగా ఎదిగి ప్రేక్షకుల గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ఎప్పుడైతే తనను హీరోగా చూడడం ప్రేక్షకుల ఇబ్బంది పడ్డారో అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో ఇతర పాత్రల్లో నటిస్తున్నాడు. ఈసారి
కమెడియన్ గా కాకుండా విలన్ పాత్రలు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆయనకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారట
టాలీవుడ్ దర్శకులు. ప్రస్తుతం
సుకుమార్ దర్శకత్వంలో ని పుష్ప సినిమాలో ఓ కీలకమైన పాత్రలో చేస్తున్నాడట సునీల్.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో
సునీల్ పాత్ర ఎంతో ముఖ్యమైనది అంటున్నారు. కమెడియన్ కాకపోయినా ఒక కీలకమైన పాత్ర అని తెలుస్తుంది
సునీల్ చేసే ఈ పాత్ర. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లాంటి ఈ ఇన్నింగ్స్ ను
సునీల్ సమర్ధవంతంగా పోషించి వరుస అవకాశాలు దక్కించుకుని తన పూర్వ వైభవం తెచ్చకోవాలని చూస్తున్నాడు.
ఈ సినిమానే కాకుండా
సునీల్ మరిన్ని పెద్ద ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నాడు. ముఖ్యంగా
విజయ్ దేవరకొండ తమ్ముడు
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూడో
సినిమా పుష్పకవిమానం సినిమాలో
పోలీస్ ఆఫీసర్ గా మంచి పాత్ర చేయబోతున్నాడట సునీల్. ఈ సినిమాపై
సునీల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు తెలుస్తుంది ఈ
సినిమా తర్వాత ఆయన మరిన్ని అవకాశాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడట ఓవైపు హీరోగా, మరో వైపు విలన్ గా, ఇంకోవైపు
కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ
టాలీవుడ్ లో కొనసాగుతున్న ఒకే ఒక నటుడు
సునీల్ మాత్రమే కావచ్చు. మళ్లీ గతంలోలా బిజీ అవ్వాలని చూస్తున్న
సునీల్ కు ఈ సినిమాలో ఏ విధంగా ఉపయోగపడతాయి చూడాలి.