ఇక ఈ సినిమా పూర్తి కాకుండానే చైతు మరో సినిమా లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. టాలెంటెడ్ డైరక్టర్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో నాగ చైతన్య సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం కిశోర్ తిరుమల శర్వానంద్ తో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చైతుతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. తను ఎంచుకున్న కథను న్యాయం చేసే దర్శకులలో కిశోర్ తిరుమల ఒకరు. నేను శైలజ నుండి రెడ్ వరకు అతని సినిమాలు చూస్తే అర్ధమవుతుంది.
రెడ్ తర్వాత శర్వానంద్ తో సినిమా చేస్తున్న కిశోర్ తిరుమల చైతుని మెప్పించే కథతో వచ్చాడు. చైతన్య కూడా డైరక్టర్ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి వెంటనే ఓకే చెప్పినట్టు టాక్. లవ్ స్టోరీ ఎలాగు బజ్ బాగుంది కాబట్టి అంచనాలకు తగినట్టుగానే ఉండే అవకాశం ఉంది. ఇక మరోపక్క థ్యాంక్ యు కూడా మెప్పించే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా కిశోర్ తిరుమల మూవీ కూడా క్రేజీగా మారుతుంది. ఈ మూడు సినిమాలతో చైతు తన హిట్ మేనియా కొనసాగిస్తాడని చెప్పొచ్చు. మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ హీరో సత్తా చాటుతాడని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి