హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం మా అసోసియేషన్ బైలాస్ లోని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఒక విషయం బయట పడింది అంటున్నారు. దీని ప్రకారం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీకాలం ఎంత అన్నవిషయం ఎక్కడా పేర్కొనలేదు అని అంటున్నారు. రెండేళ్ల పదవీ కాలం అన్నది సంప్రదాయంగా వస్తున్నదే కానీ నిబంధనల ప్రకారం కాదని ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళితే మా ఎన్నికలు ఆగిపోయే ఆస్కారం ఉంది అంటూ సరికొత్త ప్రచారం ఊపందుకుంది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోతున్న మా ఎన్నికలలో తాను శ్రీకృష్ణుడుగా మారి ఒక వర్గానికి సపోర్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పడంతో నరేష్ సపోర్ట్ ఇచ్చే ఆ వర్గం ఎవరు చర్చలు మొదలయ్యాయి. ఈపరిస్థితులు ఇలా ఉండగా మా ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ ఇప్పటికే పూరీ జగన్నాథ్ ఆఫీసు నుండి మా ఎన్నికల రాజకీయాన్ని నడిపిస్తున్నాడు అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
మరొకవైపు నరేష్ మా సంస్థ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా ఒక బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడు అంటూ కొందరి కామెంట్స్ చేసాడు అని వస్తున్న వార్తలలో నిజం ఎంత అన్న విషయమై కూడ అనేక ఆశక్తికర చర్చలు ఇండస్ట్రీ రంగాలలో జరుగుతున్నాయి. ఈ విషయాలు చాలవు అన్నట్లుగా మా సంఘానికి ఏటా డైరీని 8 లక్షలకు ప్రింట్ చేసే వ్యక్తిని పక్కకు పెట్టి ఈ ఏడాది మరో కొత్త వ్యక్తి చేత మా డైరీ ప్రింటింగ్ బాధ్యత అప్పచెపితే ఆ డైరీ నాలుగు లక్షలకే పూర్తి అవుతుంది అంటూ వస్తున్న వార్తల నడుమ ఇలాంటి వ్యవహారాలు ఇంకా మా సంస్థలో వెలుగు చూస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి