
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్ లు గా ఎదిగి తమ సత్తా చాటుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించారు కథానాయికలు. మొదటి సినిమాతోనే హిట్ సాధించి మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న చాలామంది నటులలో ఒకరు ఆర్తి అగర్వాల్. ఆమె వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే విజయం అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అవతరించింది.
అంతకు ముందు ఓ హిందీ సినిమాలో చేసిన కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ సినిమా చేసిన తర్వాత వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ విధంగా నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, నీ స్నేహం, పలనాటి బ్రహ్మనాయుడు వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఆర్తి అగర్వాల్.
దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈమె 2005 తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక హీరో తో ప్రేమలో పడటం ఆ ప్రేమ విఫలం కావడం దీనికి కారణాలు అని చెబుతూ ఉంటారు. తర్వాత నటిగా మళ్లీ తన కెరీర్ ని కొనసాగించారు ఆర్తి అగర్వాల్ 2006లో సునీల్ సరసన అందాల రాముడు సినిమాలో నటించారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసి నటిగా తన ముద్రను వేసుకున్నారు. అయితే 2007లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఆర్తి అగర్వాల్ వివాహం జరిగింది. అయితే వారిద్దరూ 2009లో విడిపోయారు. బాగా లావు పెరగడం తో 2015 లో ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ సర్జరీ చేయించుకోవడం, అది వికటించడం తో చనిపోయారు అని అంటూ అంటారు. చనిపోయే ముందు ఆర్తి అగర్వాల్ ఊపిరి సంబంధిత సమస్యలతో కూడా బాధ పడ్డారు.