సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏ సెలబ్రిటీ అయినా చిన్న పొరపాటు చేస్తే చాలు వారిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ దారుణం గా ట్రోల్ చేసి పడేస్తారు. ఆ విధంగా టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీలు ట్రోల్ కి గురయ్యారు. స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ లు అనే భేదం ఏమి ఉండదు ఈ ట్రోల్స్ చేసే వారికి. ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుందా అని వెతికి వెతికి మరీ ఆ తప్పుని పట్టుకొని వారి నిజ స్వరూపాన్ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

ఇక ఆ విధంగా మనస్థాపానికి గురై చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాను వదిలేసారు. అంతే కాదు సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేసి జీవితాంతం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి కూడా వచ్చేసారు. అయినా కూడా అలాంటి సెలబ్రిటీల పై ఈ నెటిజన్ల యుద్ధం ఆగదు. ఏదో ఒక రకంగా వారిపై ట్రోల్లింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇటీవలె దర్శకుడు కొరటాల శివ కూడా సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న ఆయన త్వరలో ఎన్టీఆర్ తో సినిమాతో బిజీ కాబోతున్నానని అందుకే సోషల్ మీడియాను పట్టించుకునే ఫ్రీ గా లేను అని దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన ఈ మధ్య వెల్లడించారు.

అయితే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్ద పెద్ద కారణమే ఉందట. కొరటాల శివ ఎన్టీఆర్ కంటే ముందుగా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా చేయలేకపోతున్నాను కొరటాల శివ వెల్లడించాడు. దానికి బదులు ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని ఈ సినిమా పూర్తి అవగానే ఆ సినిమాపై దృష్టి పెడతానని వెల్లడించాడు. అయితే ఈ కారణంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రొల్ చేయడం మొదలు పెట్టారట. కొన్ని అసభ్య వ్యాఖ్యలు కూడా రాసి ఆయనను నొప్పించారట. అందుకే ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: