ముకుందా సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ తరువాత క్రిష్ తీసిన కంచె మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆపై ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ సినిమాలతో మరొక మూడు విజయాలు సొంతం చేసుకుని యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వరుణ్ తేజ్, ప్రస్తుతం యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి తో చేస్తున్న సినిమా గని. నూతన నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్దా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో హీరో వరుణ్ తేజ్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నట్లు సమాచారం.

బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా కన్నడ యాక్టర్ ఉపేంద్ర, విలక్షణ నటుడు జగపతి బాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అందరి నుండి మంచి స్పందన లభించింది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలో విడుదల కావలసి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరొక రెండు నెలలు వాయిదా పడినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఇప్పటికే బాక్సింగ్ లో ప్రత్యేకంగా నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్న వరుణ్ తేజ్ శారీరకంగా ఎంతో కష్టపడ్డట్లు తెలుస్తోంది.

ఇక రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో గని మూవీ కోసం చేస్తున్న వర్కౌట్స్ తాలూకు ఒక ఫోటో ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు వరుణ్. ఇక ఆ ఫోటోలో వరుణ్ ఫుల్ గా బాడీ పెంచి ఎంతో దృఢంగా కనిపించారు. అయితే ఆ ఫోటోని చూసిన పలువురు మెగాఫ్యాన్స్, బాబోయ్ వరుణ్ ఇంత భారీగా బాడీ పెంచిన నిన్ను చూస్తుంటే మూవీ కోసం ఎంతలా కష్టపడ్డావో అర్ధం అవుతోంది. తప్పకుండా గని మూవీ సక్సెస్ కొట్టి నీ కెరీర్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టాలి బ్రదర్ అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకు విషెస్ తెలియచేస్తున్నారు..... !!  


మరింత సమాచారం తెలుసుకోండి: