
తెలుగు సినీ నీ ప్రపంచంలో సంగీతానికి ఉన్న ప్రాముఖ్యత ఏ విభాగానికి ఉండదు. సగం సినిమా సంగీతం తోనే సూపర్ హిట్ అవుతుంది. ఎన్నో సినిమాలు పాటలు బాగుంటేనే ఆడిన రోజులు ఉన్నాయి. సంగీతం విషయంలో మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏ విధంగానూ చాన్స్ లు తీసుకోరు. సంగీత దర్శకులకు అవకాశాలు ఇస్తూ సినిమాలను అద్భుతంగా ఉండేలా చూసుకుంటారు. అలా అందరి స్టార్ హీరోలకు తన సంగీతం తో మరపురాని హిట్లను అందించిన టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ పుట్టినరోజు ఈ రోజు.
ఆయన ప్రస్తుతం సంగీతం అందిస్తున్న సినిమాల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లాహే లాహే అనే పాట కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకి కూడా మణిశర్మ నే సంగీత దర్శకుడు అని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి మరొకసారి మణి శర్మ నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
సుధీర్ బాబు హీరోగా చేస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఇప్పుడు మణి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్. ఈ సినిమా నుంచి మందులోడా ఓరి మాయలోడ అనే పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విక్టరీ వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తున్న నారప్ప, గోపీచంద్ సిటీ మార్, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, శర్వానంద్ కొత్త సినిమా, ఒక చిన్న సినిమా, నితిన్ హీరోగా ఓ సినిమా, కలిపి మొత్తం ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. గతంలో మణి శర్మ పని అయిపోయిందని విమర్శలు చేసిన వారికి ఈ సినిమాలు పెద్ద సమాధానం చెబుతున్నాయి.