టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఉన్న వి.వి.వినాయక్ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. పెద్ద హీరోలు ఎవరూ ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవడంతో చిన్న హీరోతో అయినా ముందుకు వెళ్లి హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ లో చత్రపతి సినిమా రీమేక్ చేస్తున్నాడు. వినాయక్ కి ఈ సినిమా తప్ప వేరేది లేదు.  తెలుగులో పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు.  మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోలను డైరెక్ట్ చేసిన వి వి వినాయక్ ఇప్పుడు ఇలా అవడం ఆయన అభిమానులు ఎంతో కలచివేస్తుంది .

చివరిగా ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమా ఆ తర్వాత సినిమాలేవి ఒప్పుకోలేదు. చిన్న హీరోలు సైతం ఆయనకు సినిమా ఇవ్వడానికి ఆలోచిస్తున్న సమయంలో ఆయన కెరీర్ దాదాపు అయిపోయింది అనుకుంటున్నారు.  కానీ బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ ను టాలీవుడ్ లో హీరోగా పరిచయం చేసిన వి.వి.వినాయక్ బాలీవుడ్ లో కూడా ఆయనే పరిచయం చేస్తూ ఉండడం విశేషం. 

రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమా వీరిద్దరి కాంబినేషన్లో బాలీవుడ్ లో రీమేక్ అనగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఎప్పుడో చేసిన అందరు చూసిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ కి ఇదే సరైన సినిమా అనీ ఈ సినిమా చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి దర్శకత్వం వహించిన మరో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట వినాయక్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ స్కోప్ ఉందట. ఈ సినిమా రీమేక్ చేస్తే బాగానే ఉంటుంది అన్న ఆలోచనకు వినాయక వచ్చాడట. ఈ నేపథ్యంలో ఎవరిని హీరోగా పెట్టి అక్కడ సింహాద్రి సినిమా రీమేక్ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: