కే జి ఎఫ్ సినిమా ఒక్కసారిగా దేశమంతటా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కన్న డ స్టార్ హీరో యశ్. అప్పటివరకూ చిన్న కుటీర పరిశ్రమ గా ఉన్న కన్నడ చిత్ర పరిశ్రమ పేరు ఒక్కసారిగా దేశం మొత్తం మారుమోగిపోయింది. యశ్ కూడా దేశం మొత్తం క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. భారతదేశంలోని ఏ పరిశ్రమ నుంచి ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా రాలేదంటే నమ్మాల్సిందే.

ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కి కూడా వస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రేక్షకుల్లో. ఈ సిని మా త్వరలోనే విడుదల కాబోతుండగా సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కే జి ఎఫ్ సినిమా తో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా హీరోగా మారిన యశ్ తన తదుపరి చిత్రాన్ని ఓ టాలీవుడ్ దర్శకుడి తో  చేయడానికి చూస్తుండడం విశేషం. టాలీవుడ్ లో మాస్ చిత్రా ల దర్శకుడి గా పేరు దక్కించుకున్న బోయపాటి శ్రీను తో యశ్ సినిమా చేయబోతున్నాడట.

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుండగా దీని తర్వాత ఆయన తమిళ స్టార్ హీరో సూర్య తో సినిమా చేస్తాడనీ అని వార్తలు రాగా ఇప్పుడు యశ్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అఖండ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతోంది. బాలకృష్ణ కాంబినేషన్ లో బోయపాటి శీను చేస్తున్న మూడో సినిమా ఇది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: