అక్కినేని వంశం నుంచి వచ్చిన హీరోలలో ఒకరు సుమంత్. ప్రేమకథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న సుమంత్ ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేయగా అవి హిట్ సాధించాయి. అక్కినేని వంశం నుంచి మరో స్టార్ హీరో రావడం ఖాయం అని అనుకున్నారు కానీ ఆయన సినిమాల ఎంపికలో లోపాల వలన ఆయన మినిమ హీరోగా కూడా నిలబడలేకపోయాడు. ఆ తరువాత ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి విఫలం కావడంతో సినిమాలకు పూర్తి గా దూరం అయ్యాడు.

దాంతో సుమంత్సినిమాలు చేయడా అని సందేహం ప్రేక్షకుల్లో నిలవగా ఆయన అభిమానులు అక్కినేని సుమంత్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే మరి ఎదురు చూపులకు సమాధానంగా మళ్లీ రావా అనే వినూత్నమైన సినిమాతో సుమంత్ కం బ్యాక్ చేసి మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ చిత్రం తో గౌతమ్ తిన్ననూరి అనే మంచి దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవ్వగా సుమంత్ కు మంచి చిత్రంగా మిగిలిపోయింది మళ్లీ రావా. ఆ తర్వాత కపటాధరి అనే సినిమా తో సుమంత్ మరొక హిట్ సాధించి థ్రిల్లర్ జోనర్ లో కూడా సినిమాలు చేయగలను అని చెప్పాడు. 

సుబ్రమణ్య పురం అనే వెరైటీ కథనంతో ఉన్న సినిమాలు చేయగా ప్రస్తుతం వాల్తేరు వాసు అనే సినిమాలో బిజీగా ఉన్నాడు సుమంత్. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఓ త్రిభాషా చిత్రములో కీలక పాత్రలో నటిస్తున్నాడు సుమంత్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి ఒక త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ హీరో మళ్ళీ వరుస చిత్రాలతో బిజీ అవుతుండటం చూస్తుంటే సుమంత్ మరికొన్ని సంవత్సరాలు హీరో గా ఉండటం ఖాయం అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: