
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా నేషనల్ స్థాయి గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి ఈ సినిమా ను అంతకుమించి హిట్ చేయాలనే భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఉన్న ఇద్దరు హీరోలు నటిస్తుండడం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతుంది. బాలీవుడ్ తారాగణం కూడా నటిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ జనాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదల తేదీ కన్ఫామ్ కాకపోవడం ఇతర హీరోల సినిమాల పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది. కానీ విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ రాకముందు ఈ సినిమా అక్టోబర్ లో విడుదల అవుతుందని వెల్లడించగా ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయిన నేపథ్యంలో ఈ సినిమా విడుదల సంక్రాంతి కి కానీ వేసవి కి వెళ్లపోతుంది అని మాత్రం తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఇంత పెద్ద భారీ సినిమా తమ సినిమాలకు ఎదురు వస్తుందనే భావన ఇతర హీరోల లో నెలకొంది. చిరంజీవి నటించిన ఆచార్య, బాలకృష్ణ అఖండ, ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకోవాలంటే ముందుగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ తెలియాల్సి ఉన్న నేపథ్యంలో రాజమౌళి అర్ ఆర్ ఆర్ విడుదలను నాన్చడం తో వారు తమ సినిమాలను ఎప్పుడు విడుదల చేసుకోవాలో అన్న అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో త్వరగా రాజమౌళి విడుదల తేదీని ప్రకటిస్తే వీరు కూడా సినిమాలను విడుదల చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఎప్పుడు డేట్ ను ప్రకటిస్తారో చూడాలి.