ప్రస్తుతం అన్ని భాషలలో మార్కెట్ పెంచుకోవడానికి టాలీవుడ్ హీరోలు ఎంతగానో కృషి చేస్తున్నారు. తమ సినిమాలను అన్ని భాషలలో విడుదల చేస్తూ ఎంతో కొంత మార్కెట్ ను పెంచుకునే విధంగా ఆలోచిస్తూ భారీ కాన్వాస్ ఉన్న చిత్రాలను చేయడం మొదలుపెట్టారు.  వీరిలో ముఖ్యంగా అల్లు అర్జున్ ఎప్పటినుంచో తన మార్కెట్ ను అన్ని భాషలలో పెంచుకునే విధంగా సినిమాలు చేస్తూ వచ్చాడు.  ముఖ్యంగా ఆయనకు మలయాళంలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా వస్తుందంటే అక్కడి స్టార్ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ ను ఆపుకుంటారు.  ఆ రేంజ్ లో మలయాళంలో అల్లు అర్జున్ మార్కెట్ ను సంపాదించుకోగలిగాడు.  

తెలుగువాడైన మలయాళ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి అల్లు అర్జున్ ఆ తర్వాత తమిళంలో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయగా ఓ సినిమాను కూడా మొదలు పెట్టి దాని మధ్యలో ఆపేశాడు. కానీ డబ్బింగ్ సినిమా ల ద్వారా తమిళ ప్రేక్షకులకు కూడా అల్లు అర్జున్ బాగా దగ్గరయ్యాడు. ఆయన సినిమాలను విశేషంగా ఆదరిస్తూ తనపై అభిమానాన్ని చూపిస్తున్నారు తమిళ ప్రేక్షకులు.  ఇక ఇప్పుడు ఆయన కన్నడంపై ఫోకస్ పెట్టాడు. దానికి తగ్గట్లే అక్కడి ప్రేక్షకులు కూడా బన్నీని స్వాగతించారు.  ఆయన నటించిన అలా వైకుంఠపురం లో సినిమా కన్నడ వర్షన్ ఇటీవలే టెలివిజన్ లో రాగా దానికి టాప్ టిఆర్పి రేటింగులు వచ్చాయి. 

దీన్ని బట్టి బన్నీ మొత్తం సౌత్ లోనే మంచి క్రేజ్ ఉన్న హీరో గా అవతరించాడు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుండడంతో ఇప్పటివరకు వచ్చిన ఇమేజ్ ఒక లెక్క ఇప్పటినుంచి వచ్చే ఇమేజ్ ఒక లెక్క అన్నట్లు తయారైంది పరిస్థితి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుంది అని ఇటీవల వచ్చిన టీజర్ తెలియజేసింది. మరి పాన్ ఇండియా హీరోగా తొలిసారి సినిమా చేయబోతున్న అల్లు అర్జున్ కు ఈ సినిమా ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: