లవర్ బోయ్ సిద్ధార్థ్, జెనిలియా జంటగా భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా బొమ్మరిల్లు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా జెనిలియాకు బదులుగా సింధు తులానిని అనుకున్నారట నిర్మాత దిల్ రాజు. కాని డైరక్టర్ భాస్కర్ హ్యాపీ సినిమాలో జెనిలియా నటన చూసి ఆమె కళ్లలో ఎక్స్ ప్రెషన్స్ బాగుంటాయని ఆమెని సెలెక్ట్ చేశారట. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో జెనిలియా ఎంత మంచి పేరు తెచ్చుకుందో తెలిసిందే.

ఇక ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ కన్నా ముందు ఎన్.టి.ఆర్ ను అనుకున్నారట. అప్పటికే మాస్ ఇమేజ్ ఉన్న ఎన్.టి.ఆర్ ఆ లవ్ స్టోరీ సూట్ అవదని వద్దన్నారట. ఇక అల్లు అర్జున్ కూడా బొమ్మరిల్లు సినిమాలో నటించాల్సిందట. బన్నీ కూడా డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ సినిమా వదులుకున్నారట. ఫైనల్ గా ఆ ఛాన్స్ సిద్ధార్థ్ కు వరించింది. అప్పటిల్కే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలంటే యూత్ ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది.

ఒకవేళ నిజంగానే సిద్ధార్థ్ బదులుగా ఎన్.టి.ఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ఆ సినిమాలో నటిస్తే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. తారక్ అయితే కష్టమేమో కాని బన్నీ ఆ పాత్రకి బాగానే సూటయ్యే వాడని చెప్పొచ్చు. బొమ్మరిల్లు హిట్టు కొట్టాడు కాబట్టే అల్లు అర్జున్ పరుగు సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కెరియర్ లో చాలా గ్యాప్ తర్వాత అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్.


మరింత సమాచారం తెలుసుకోండి: