కరీంనగర్ జిల్లా కు చెందిన శేఖర్ అనే వ్యక్తి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కు, వీరాభిమాని అవ్వడంతో , ఆయనకు కూడా ఇతను అంటే చాలా ఇష్టం. అయితే వరుణ్ తేజ్ విడుదలైన ప్రతి సినిమాను మొదటగా ఫస్ట్ షో నే చూసేవాడు. కానీ ఈ మధ్యనే అతను చనిపోవడంతో, వారి ఇల్లు ఆర్థిక ఇబ్బందులలో పడింది. ఈ విషయం వరుణ్ తేజ్ చెవిన పడడంతో, వెంటనే తన వంతు సహాయంగా రెండు లక్షల రూపాయలను అందించారు వరుణ్ తేజ్.
మెగాస్టార్ ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారందరికీ ప్రియమైన అభిమానులు చాలా మంది ఉన్నారు. అయితే ఇలా తమ అభిమానులకు ఆర్థిక సహాయం అందించడంలో మెగాస్టార్ ఫ్యామిలీ ముందుంటారని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఇదే తరుణంలో కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక అభిమాని చనిపోవడంతో తను కూడా సహాయం చేసిన విషయం మనకు తెలిసింది. ప్రముఖ జర్నలిస్ట్ డి.ఎన్.ఆర్ చనిపోవడంతో, ఆయన కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ , వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. ఇలాంటి సహాయాలు ప్రతి ఒక్కరు కూడా చేస్తే బాగుంటుంది.
ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే, ఇప్పుడు F3, గణేష్ సినిమాలలో నటిస్తున్నారు. ఇవి రెండు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి