ఇక ఈ సినిమా తర్వాత అసలైతే కొరటాల శివతో ప్రాజెక్ట్ ఒకటి అనుకున్నా అది కాస్త అది ఎందుకో పోస్ట్ పోన్ అయ్యింది. బన్నీతో సినిమా చేయాల్సిన కొరటాల శివ ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే తారక్ సినిమా తర్వాత అయినా కొరటాల శివ కచ్చితంగా అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. పుష్ప రెండు పార్టులను ముగించిన తర్వాత ఐకాన్ చేయాలని చూస్తున్న బన్నీ ఆ సినిమా తర్వాత త్రివిక్రం తో మరో సినిమా చేస్తారని తెలుస్తుంది. అయితే ఈసారి త్రివిక్రం సినిమాను సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
కొరటాల శివ సినిమా మాత్రం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తారని అంటున్నారు. అల్లు అర్జున్, కొరటాల శివ కాంబో సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. అందుకే ప్రాజెక్ట్ రెండేళ్లు లేట్ అయినా కచ్చితంగా ఈ కాంబో సినిమా వస్తుందని చెబుతున్నారు. అల్లు అర్జున్ సినిమాల లైనప్ చూస్తుంటే అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు. పుష్పతో ఎలాగు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకునే బన్నీ రాబోయే సినిమాలతో నేషనల్ స్టార్ గా సెన్సేషనల్ సృష్టించేలా ఉన్నాడు. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన బన్నీ ఆ క్రమంలోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి