తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మంచితనం గురించి మనం పెద్దగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే వారిలో ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉన్న వారే. అలాగే ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్స్ పుట్టుకొచ్చారు. ఇదిలా ఉండగా త్వరలోనే మెగావార్ మొదలు కానుందట, ఇక ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం ఐకాన్ స్టార్ నటిస్తున్న  పుష్ప మూవీ షూటింగ్ ఆగస్టు నెలలో పూర్తి కావస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ తేదీ మాత్రం ఖరారు చేయలేదు. ఎందుచేత అంటే ప్రతి పండగకు మెగా ఫ్యామిలీ నుంచి ఏదో ఒక హీరో సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే  ఈ పుష్ప సినిమాను మాత్రం ఏ పండక్కి విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే. ఈ సినిమాను అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదల తేదీనే చాలా సమస్యగా మారింది.


ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ మూవీ rrr  అక్టోబర్ 13న ఇదే సంవత్సరంలో క్రిస్మస్ పండుగ కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి బరిలో రెండు సినిమాలతో మన ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక ఎప్పుడో ఒకప్పుడు విడుదల చేయాల్సిన పుష్ప సినిమాని మెగా హీరోల మధ్య పోటీ గా దించాల్సి ఉంటుంది.


ఇక అందరు స్టార్ హీరోలే కాబట్టి.. ప్రతి సినిమాపై కూడా కలెక్షన్లు ప్రభావం చూపుతోంది. ఇక వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు పుష్ప టీం మెంబెర్స్. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ కొరటాల శివ మూవీ లో నటించనున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కొత్త పాత్రలో నటించనున్నాడు. ఏది ఏమైనా ఈ సారి మెగా ఫ్యామిలీ నుంచి వార్ మొదలవుతోందనే  వార్త వినిపిస్తోంది. ఇక ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఏ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: