ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాల పర్వం నడుస్తోంది. టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘రామాయణం 3 డి’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కనిపించబోతుండగా, రాముడిగా టాలీవుడ్ స్టార్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో సీత పాత్రను ఎవరు పోషిస్తారు? అనేది ముఖ్యం. కాగా, మూవీ మేకర్స్ సీత పాత్ర చేయాలని కోరుతూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. కాగా, తాను రూ.10 కోట్లకు పైగా డిమాండ్ చేసిందని చర్చ నడిచింది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలోని మహిళలు ఇంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం సబబేనా? అనే చర్చ షురూ అయింది. ఈ విషయమై ఆన్ లైన్‌లో ప్రజెంట్ డిబేట్ రన్ అవుతోంది.

ట్రయాలజీ సిరీస్‌లో సీత పాత్ర ముఖ్యం. కాగా, రెమ్యునరేషన్ విషయంలో దీపిక తగ్గకపోవడంతో మూవీ యూనిట్ బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ను సంప్రదించారట. ఆమె రూ.12 కోట్లు అడిగినట్లు ప్రచారం షురూ అయింది. ఆమె అంత ఎందుకు డిమాండ్ చేస్తున్నదన్న విషయమై చర్చ షురూ అయింది. అడిగితే తప్పేంటి? అనే వాదనలు వినిపిస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో కేవలం హీరోలకేనా హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్.. హీరోయిన్స్ కు ఉండవా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కరీనాకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మద్దతు తెలిపింది. వేతన సమానత్వం మస్ట్‌గా ఉండాల్సిందేనని ప్రియమణి పేర్కొంది. టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ కూడా ఈ విషయమై స్పందించింది. రెమ్యునరేషన్  విషయంలో హీరోయిన్స్‌కు హక్కులుంటాయని, వారి అర్హతను బట్టి వారు అడుగుతుంటారని చెప్పింది. ఇక రామాయణం ఆధారంగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆది పురుష్’ఫిల్మ్‌లో సీతగా కృతి సనన్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: