బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదని అందరికి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో ఈ బిగ్‌ రియాల్టీ షోకి అభిమానులు ఉన్నారు. ఇక తెలుగులో అయితే ఈ షోకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మిగతా భాషల కంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. గత నాలుగు బిగ్ బాస్ సీజన్ల టీఆర్పీ రేటింగ్స్‌ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది.

తెలుగులో వచ్చిన నాలుగు సీజన్స్‌ భారీ హిట్‌ కావడంతో ఐదో సీజన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. వాస్తవానికి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ సంవత్సరం మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉంది . కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడటం జరిగింది.ఇదిలా ఉంటే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు .ఇప్పటికే సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే సెప్టెంబర్‌ 5వ తారీఖు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది
 ఇదిలా ఉంటే, ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇలా ఉంది అంటూ కొంతమంది పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో హాట్ యాంకర్‌ వర్షిణి, కామెడీ యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబ్ హీరో షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి

అయితే ఈ లిస్ట్‌ నుంచి మంగ్లీ తొలగింప బడినట్లు సమాచారం . మొదట్లో ఈ షోకి వెళ్లడానికి మంగ్లీ అంగీకారం వ్యక్తం చేసినప్పటికీ తాజాగా ఆమె మనసు మార్చుకుందట.ఇటీవల బోనాల పాటపై వచ్చిన వివాదంతో బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే షో ప్రారంబించే సమయానికి ఎలాగైనా మంగ్లీని ఒప్పించి, తీసుకురావాలని షో నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. 'బిగ్‌బాస్‌'కోసం మంగ్లీ మళ్లీ మనసు మార్చుకొని పాల్గొంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: