
టాలీవుడ్ సినిమా పరిశ్రమను ఒక్కసారిగా అల్లకల్లోలం చేసిన కరోనా వల్ల సినిమా నిర్మాతలు వేసుకున్న ప్లాన్స్, దర్శకులు రచించుకున్న ప్రణాళికలు అన్ని తలకిందులయ్యాయి. ఒక సమయంలో రావలసిన సినిమాలు మరొక సమయానికి పోస్ట్ పోన్ అవుతూ వచ్చి అన్ని సినిమాలు ఒకే దగ్గరికి చేరి ఒకే సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విధంగా టాలీవుడ్ లో నలుగురు స్టార్ హీరోల సినిమా లు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అది కూడా వారు తండ్రీకొడుకులు అవడం ఇక్కడ విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ దసరాకు సినిమా విడుదల చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తుండగా ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఇకపోతే అదే సమయానికి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా విడుదల అవుతుంది. అక్టోబర్ 13న విడుదల అవుతుండగా ఈ తండ్రి కొడుకులకు బాక్సాఫీసు వద్ద తొలిసారి వార్ తప్పదని అనిపిస్తుంది. మరో వైపు నందమూరి బాలకృష్ణ కూడా తన తదుపరి సినిమా విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. సెప్టెంబరు లో లేదా అక్టోబరు లో కానీ ఈ సినిమాని విడుదల చేయాలని దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడు.

అయితే బాలయ్యకు వరసకు కొడుకైనా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అదే సమయంలో విడుదల అవుతుండడం ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటది. ఇలా నలుగురు స్టార్ హీరోలు నటించిన మూడు సినిమాలు ఒకేసారి విడుదల అవడం తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా కలిగించే విషయమే అయినా వీరిలో ఏ సినిమాలు హిట్ అవుతాయో అని సదరు అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. సీనియర్ హీరోలైనా చిరంజీవి బాలకృష్ణ యంగ్ హీరోలైన రామ్ చరణ్ ఎన్టీఆర్ ల తో పోటీపడి తమ సినిమాలను హిట్ చేసుకుంటారా అనేది చూడాలి.