
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం రాధే శ్యామ్ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా రాకపోవడంతో అభిమానులు మధ్యలో కొంత ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు ఈ సినిమా బృందం దిగొచ్చి సంక్రాంతి కి విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ఆసక్తికరమైన చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్. కే జి ఎఫ్ సినిమా తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా దర్శకుడిగా తన ప్రతిభ చాటుకోవడం తో పాటు మంచి పాపులారిటీని కూడా అందుకున్నాడు ప్రశాంత్ నీల్. ఆయన తదుపరి చిత్రంగా ఏ చిత్రం వస్తుందో ఎంతటి భారీ రేంజ్లో సినిమా వస్తుందో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ప్రభాస్ తో సినిమా అనగానే అందరిలో ఒక్కసారిగా ఎంతో ఆసక్తి కలిగింది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇప్పుడు సెట్స్ పైనే ఉన్నాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇలా టాలీవుడ్ లో ఒకేసారి నాలుగు సినిమాలను తెరకెక్కిస్తున్న హీరోగా రికార్డులకెక్కాడు ప్రభాస్. ఆది పురుష్ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ప్రభాస్. సలార్ 30 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మునుముందు ఇలాంటి గొప్ప గొప్ప రికార్డులను ఎన్ని తన పేరిట లిఖించుకుంటాడో చూడాలి.