సూపర్ స్టార్ మహేష్ బాబు బాల నటుడిగా సినిమాలలోకి వచ్చి ప్రేక్షకులను ఇప్పటికి అలరిస్తూనే ఉన్నాడు. నీడ సినిమాతో 1979 సంవత్సరంలో ప్రేక్షకులకు పరిచయమైన మహేష్ బాబు ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తండ్రితో, అన్నయ్యతో కలిసి నటించాడు. అయితే 1990 సంవత్సరం తర్వాత ఆయనకు పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. కొడుకు చదువుకోవాలని ఉద్దేశంతో కృష్ణ మహేష్ బాబును నటనకు దూరంగా ఉంచాడు. అలా 2000 సంవత్సరంలో మహేష్ బాబు రాజకుమారుడు అనే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రభంజనం మొదలయ్యింది.

ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలకు గాను ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నారు. తొలి చిత్రంతో ఉత్తమ నూతన నటుడు గా నంది పురస్కారం అందుకున్నాడు. రాజకుమారుడు సినిమాకి గాను ఉత్తమ నూతన నటుడు పురస్కారం అందుకోగా, దక్షిణ భారత ఫిలింఫేర్ పురస్కారం ను ఒక్కడు సినిమా కి అందుకున్నాడు. నిజం సినిమాకి గాను మరో నంది ఉత్తమ నటుడి పురస్కారం అందుకోగా, అతడు సినిమాకు, దూకుడు సినిమా లకి కూడా ఉత్తమ నంది నటుడుగా అవార్డు అందుకున్నాడు.  బిజినెస్ మెన్ కి కూడా దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు.

అయితే మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటి వరకు కొన్ని కొన్ని చేయలేదు. ఇతర హీరోలు వెంటపడి ఆశపడి మోజుపడి చేసే వాటిని మహేష్ బాబు  చేయకపోవడం విశేషం . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ హీరోలు రీమేక్ సినిమాలను చేసినవారే. హలో మహేష్ బాబు రీమేక్ ల జోలికి వెళ్ళలేదు అంతేకాకుండా ప్రతి హీరో తమ కెరీర్లో ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటారు కానీ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు చేయలేదు. బాల నటుడి గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు మహేష్ బాబు. హీరోగా అవతారం ఎత్తిన తర్వాత ఇంతవరకు ఆయన ఒక్క సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: